AP: అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో 8 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే నర్సీపట్నంలో 6 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. సోమవారం అనకాపల్లిలో మరో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం జరగనుంది.