AP: అనకాపల్లిలోని కైలాసపట్నం శివారులోని విజయలక్ష్మి ఫైర్‌వర్క్స్‌లో భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై క్లూస్ టీమ్ సాక్ష్యాధారాలను సేకరించాయి. అందులో బాంబుల తయారీకి వాడే మందుగుండు ముడి పదార్థాలను గుర్తించారు. ఘటనా స్థలంలో 8 షెడ్లు ఉండగా.. వాటిలో మూడింట బాణసంచా తయారు చేస్తారు. మందుగుండు దట్టించే క్రమంలో నిప్పురవ్వలు వచ్చి ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ పేలుడుకు శిథిలాలు 300 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి.