అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగు రోజులుగా నిందితుడు కోసం 12 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. రాంబిల్లి మండలం కొప్పు గుండు పాలెంలో నిందితుడు సురేష్ మృతదేహం గురువారం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.