చెరుకు పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

83చూసినవారు
చెరుకు పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు
అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు వీచంద్రశేఖర్, దాడి ఉమామహేశ్వరరావు శుక్రవారం చోడవరం మండలం గోవాడ గ్రామంలో పలువురు రైతుల పొలాలను సందర్శించి వారి వేసిన వివిధ రకాల చెరుకు పంటలను పరిశీలించి సూచనలు చేశారు. గోవాడకు చెందిన బేరా నారాయణరావు, ఏడవక గోవిందు, కోట్ని నాయుడు, ఏడూవాక వెంకటసత్యనారాయణ పొలాలను వారు పరిశీలించారు. జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి పి విజేత, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్