ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

63చూసినవారు
ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు
నర్సీపట్నంలో సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా సోమవారం నిర్వహించారు. పట్టణంలోని టీడీపీ నాయకులంతా కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలకృష్ణ సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్