
గోదావరిలో దూకుతాం.. ఆత్మహత్య లేఖరాసి భార్యాపిల్లలతో వ్యక్తి అదృశ్యం
AP: ప్రయాగరాజ్ మహా కుంభమేళా సాక్షిగా గోదావరి నదికి ఆహుతి అవుతామని ఆత్మహత్య లేఖ రాసి ఇద్దరు చిన్నారులతో సహా భార్యాభర్తలు అదృశ్యమయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంకి చెందిన అంతర్వేదిపాలెం శ్రీను అప్పుల బాధతో తన భార్య గంగాభవాని(35), కుమార్తె దేవాజ్ఞ(6), కుమారుడు మాధవ్(4)తో సహా ఆత్మహత్య చేసుకుంటామని బైక్పై వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యలు ఆందోళన చెందుతున్నారు.