గుమ్ముడుగొండ సచివాలయాన్ని సందర్శించిన ప్రత్యేకాధికారి నాతవరం మండల ప్రత్యేకాధికారి వీ. నాగశిరీషా శనివారం మండలంలోని గుమ్ముడుడొండ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి రిజిస్టర్ ను తనిఖీ చేశారు. ప్రత్యేకాధికారి మాట్లాడుతూ. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.