కోటవురట్ల: చెత్తాచెదారం తొలగింపు

70చూసినవారు
కోటవురట్ల: చెత్తాచెదారం తొలగింపు
కోటవురట్ల మండలం జల్లూరు గ్రామంలో శుక్రవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పరిధిలో రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన చెత్త చెదరాన్ని తొలగించారు. మురికి కాలువలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు మాట్లాడుతూ వారానికి ఒకరోజు మండలంలో ఒక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్