కోటవురట్ల: మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

71చూసినవారు
కోటవురట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మధ్యాహ్న భోజన పథకాన్ని మండల టీడీపీ అధ్యక్షుడు జానకి శ్రీను, స్థానిక సర్పంచ్ బి. అనిల్ కుమార్, ఎంపీటీసీ పీవీ సూర్యరావు ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతిరోజు మధ్యాహ్నం విద్యార్థులకు భోజనం అందిస్తామన్నారు. ఇందుకు అవసరమైన మెటీరియల్ ముందే సమకూర్చుకున్నట్లు తెలిపారు. ఎంఈవో జోషి, హెచ్ఎం లక్ష్మి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్