నక్కపల్లి మండలంలోని చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన పలువురు బాలబాలికలకు ఆదివారం ఉదయం ఆదిత్య హృదయం పఠనం, సూర్య నమస్కారాలపై శిక్షణ ఇచ్చారు. వేంపాడు ఆయుర్వేద డిస్పెన్సరీ యోగా ట్రైనర్ డి. రాంబాబు మంత్ర సహిత, మంత్ర రహిత సూర్య నమస్కార ఆసనాలపై పిల్లలకు శిక్షణ ఇచ్చారు. అనంతరం పిల్లలు ఆరోగ్యంగా వుండేందుకు, విజయసాధనకు ఆదిత్య హృదయం పఠనంపై కూడా ఆయన శిక్షణ ఇచ్చారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు.