అచ్చుతాపురం మండలంలో దిబ్బపాలెం సెజ్ కాలనీలో బుధవారం బ్యూటీ పార్లర్ నిర్వహణపై మహిళ లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. సెజ్లోని సెయింట్ గోబైన్ కంపెనీ సామాజిక బాధ్యతలో భాగంగా 50 మంది ఆసక్తిగల మహిళలకు ఉచిత శిక్షణ అందించారు. ఈ సందర్భంగా కంపెనీ జనరల్ మేనేజర్ శర్వణ్ కుమార్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు తమ కంపెనీ తరపున చేయూతను అందిస్తామన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితే సమాజం బాగుపడుతుందన్నారు.