బాధిత కుటుంబాలకు సొంత నిధులతో ఇల్లు నిర్మిస్తా: ఎమ్మెల్యే

54చూసినవారు
బాధిత కుటుంబాలకు సొంత నిధులతో ఇల్లు నిర్మిస్తా: ఎమ్మెల్యే
అచ్చుతాపురం మండలం వెదురువాడ గ్రామంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి రెండు పూరిల్లు దగ్ధమైన బాధితులను మంగళవారం ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులను ప్రభుత్వ పరంగా అన్ని విదాలా ఆదుకుంటామనీ వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇరువురు ఇండ్లను తన సొంత నిధులతో నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చి సంబంధిత విఆర్ఓ ని రేపటినుండే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్