
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం కీలక నిర్ణయం
AP: రాష్ట్ర ప్రజల ఏళ్ల నాటి కల సాకారం కాబోతోంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. తాజాగా కేంద్రం పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.