అనంత: అక్రమాలకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకోవాలి

62చూసినవారు
మున్సిపల్ అధికారులు లంచాలకు పాల్పడుతున్నారని 40 వ డివిజన్ సి.పి.ఐ నగర కార్యదర్శి మునాఫ్ ఆరోపించారు. అనంతపురంలోని అశోక్ నగర్లో ఉన్న నూర్ బాషా మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారని, అతను దౌర్జన్యంగా పక్క ఇంటి గోడను కూల్చి రోడ్డును సైతం ఆక్రమించి ఇంటిని నిర్మించుకున్నాడని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన అధికారిపై చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్కు బాధితులు కోరారు.

సంబంధిత పోస్ట్