మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తాడేపల్లిలో శుక్రవారం కలిశారు. జిల్లా రాజకీయాలు గురించి కాసేపు చర్చించుకున్నారు. అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను రాబోయే రోజుల్లో ఎండగట్టాలని అనంత వెంకటరామిరెడ్డికి జగన్ సూచించారు.