నేడు గురువారం జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం తెలిపారు. రెవెన్యూ భవనంలో కమిటీ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పలు అభివృద్ది పనులు పై చర్చ ఉంటుందన్నారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరవుతారన్నారు.