అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రాక్టికల్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇంటర్మీడియట్ జిల్లా ఆర్ఐవో వెంకటరమణ నాయక్ ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఎ జిల్లా నాయకుడు పరమేశ్ మాట్లాడుతూ ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం దారుణం అన్నారు.