అనంతపురంలో ఘనంగా శ్రీ షిరిడి సాయిబాబాదేవాలయంలో వార్షికోత్సవం

69చూసినవారు
అనంతపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపాన ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో 24వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామున నుంచి బాబాకు పంచామృత అభిషేకం, అర్చనలు జరిగినట్లు ఆలయ ఛైర్మన్ జయచంద్ర చౌదరి, అర్చకులు శర్మ తెలిపారు. భక్తులకు బాబా ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకోవడానికి భక్తులు విశేషంగా హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్