కియా కంపెనీ తరహాలో మరిన్ని కంపెనీలు ముందుకు రావాలని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గురువారం పేర్కొన్నారు. అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు కియా కంపెనీ రూ. 5 కోట్ల విలువైన వైద్య సామగ్రి వితరణ చేసింది. ఈ సందర్భంగా కియా కంపెనీ యాజమాన్యాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు, అనంతపురం ఎమ్మెల్యే సన్మానించారు.