అనంతపురం నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ను గురువారం అనంతపురం మున్సిపల్ నూతన కమిషనర్ నాగరాజు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలో సమస్యలు లేకుండా చూడాలని కమిషనర్ ను ఆదేశించారు. పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ఎక్కడా విమర్శలు, వివాదాలకు తావు లేకుండా పని చేయాలన్నారు.