అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలతో జిల్లాలో సీఐ, ఎస్సై విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. బుధవారం ప్రజల భద్రత, రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జిల్లా అంతట విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు.