గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ఘనంగా ప్రారంభంకానున్నాయి. తొమ్మిది రోజుల పాటు రంగనాథస్వామి వివిధ వాహనాల్లో విహరిస్తారు. దేవాలయం నుంచి గ్రామ సమీపంలోని జమ్మి చెట్టు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ అధికారులు భక్తులకు పలు ఏర్పాట్లు చేశారు.