గుత్తి: 6 నుంచి బొల్లికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

56చూసినవారు
గుత్తి: 6 నుంచి బొల్లికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు
గుత్తి మండలం తొండపాడు బొల్లికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 6 నుంచి ప్రారంభమవుతాయని ఆలయ ఈవో రామాంజనేయులు మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తుల హాజరవుతారన్నారు.

సంబంధిత పోస్ట్