గుత్తి మండలంలోని కరిడికొండ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బాట సుంకులమ్మ ఆలయంలో మంగళవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం పసుపు, కుంకుమ, చీర, గాజులు అమ్మవారి సన్నిధిలో ఉంచారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.