గుత్తి శివారులోని 44వ జాతీయ రహదారిపై ఈ నెల 1న యాడికి మండల సర్వేయర్ సుంకన్న రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. పది రోజులుగా సుంకన్న అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో యాడికి తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది రూ. 50 వేల విరాళం సేకరించారు. ఆ డబ్బును తహశీల్దార్ ప్రతాప్ రెడ్డి శుక్రవారం సుంకన్న సోదరులకు అందజేశారు.