కరువు భృతి బకాయిలు వెంటనే చెల్లించాలి: విశ్రాంత ఉద్యోగులు

83చూసినవారు
కరువు భృతి బకాయిలు వెంటనే చెల్లించాలి: విశ్రాంత ఉద్యోగులు
కళ్యాణదుర్గం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో బుధవారం కార్యవర్గ సమావేశం అధ్యక్షులు శివప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి తిప్పేస్వామి మాట్లాడుతూ మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని, కరువు భృతి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ వర్క్ ఇన్స్పెక్టర్ వీరభద్రయ్య రూ. 10వేలతో పాటు రూ. 7, 500లు విలువచేసే గాడ్రెజ్ బీరువాను విశ్రాంత ఉద్యోగుల సంఘంకు వితరణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్