కళ్యాణదుర్గం డివిజనల్ డిఎస్పి రవికుమార్ ను గురువారం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు హరిగోపాల్ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో ఉన్న మాదిగల సమస్యలపైన చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెన్నప్పమాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు మారెప్ప, సీనియర్ నాయకులు బైరసముద్రం నాగరాజు, గూనిపల్లి దొనస్వామి తదితరులు పాల్గొన్నారు.