పెనుగొండ: పారిశుద్ధ కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
పెనుగొండ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి, సిఐటియు మండల కన్వీనర్ బాబావలి మాట్లాడుతూ పట్టణంలో జనాభా అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.