అనంతపురం జిల్లాలో గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా బోర్డులను రద్దు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఒక బోర్డులో ఛైర్మన్ తో పాటు పదిమంది సభ్యులు ఉంటారు. జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 63, గ్రామ పంచాయతీ స్థాయిలో 864 వ్యవసాయ సలహా బోర్డులు ఉండేవని. ప్రభుత్వం వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.