అంగన్వాడీలకు రూ. 26 వేలు కనీస వేతనం ఇవ్వాలి

76చూసినవారు
అంగన్వాడీలకు రూ. 26 వేలు కనీస వేతనం ఇవ్వాలి
అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని సీపీఎం నాయకులు రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి రాప్తాడు తహశీల్దార్ కార్యాలయం ముందు బుధవారం ఆందోళన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం అంగన్వాడీలతో గొడ్డు చాకిరి చేయించుకుంటోందని ఆరోపించారు. కనీస వసతులు కల్పించడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్