మేడాపురంలో ఉగాది పురస్కరించుకుని లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడాపురంలో స్వామివారి ప్రతిమ, గిరుగులను సమీపంలోని గుట్ట నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చారు. బుధవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాల మధ్య గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయంలోని మూలవిరాట్టును అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీపై ఊరేగించారు.