పింఛన్లు తీసుకొచ్చిందే టీడీపీ: సునీత

60చూసినవారు
పింఛన్లు తీసుకొచ్చిందే టీడీపీ: సునీత
తెలుగు రాష్ట్రాల్లో సామాజిక భద్రతా పింఛన్లను ప్రవేశపెట్టిందే టీడీపీ అని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్ను అందించనున్న నేపథ్యంలో రామగిరి మండలం వెంకటాపురంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ. ఎన్టీఆర్ హయాంలో నెలకు రూ. 35 చొప్పున పింఛన్ అందించడం ప్రారంభించారని, అది క్రమంగా పెంచుకుంటూ నేడు రూ. 4 వేలకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

సంబంధిత పోస్ట్