రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి చెందిన దశభుజ మహాగణపతి, శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయాలను హిందూపురం సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్ సందర్శించారు. శనివారం ఉదయం ఆయన ఆయా ఆలయాలకు చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అర్చకులు, ఆలయ కమిటీ పెద్దలు దశభుజ మహాగణపతి చిత్రపటం ఇస్తూ తీర్థ ప్రసాదాలు అందించారు.