ఎంత చేసిన రాయదుర్గం ప్రజల రుణం తీర్చుకోలేనిది: కాలవ

2538చూసినవారు
ఎంత చేసిన రాయదుర్గం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం శెట్టి సమాజ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కాల్వకు అభినందన సభను ఏర్పాటు చేశారు. కుర్ని శెట్టి కళ్యాణమండపంలో ఎమ్మెల్యే కాల్వకు సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. మీ మీ వ్యాపారాల్లో గాని, వ్యవహారాల్లో గాని రాజకీయ జోక్యం లేకుండా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. మీఅందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్