ఆధిపత్యం కోసం వైసీపీ హత్యా రాజకీయాలు: కాలవ ధ్వజం

71చూసినవారు
ఆధిపత్యం కోసం వైసీపీ హత్యా రాజకీయాలు: కాలవ ధ్వజం
రాయదుర్గం: అధికారం కోల్పోయిన వైసిపి నాయకులు పల్లెల్లో ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం రాత్రి మెచ్చిరి టిడిపి నాయకుడు ఆదెప్పను వైసిపి నాయకులు దారుణంగా హతమార్చడాన్ని హేయమైన చర్యగా పేర్కొన్నారు. కిరాతకంగా ఆదెప్పను మట్టు బెట్టి సాధించింది ఏమని వైసిపి నాయకులను ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్