బుక్కరాయసముద్రం మండల రెడ్డిపల్లి ఆచార్య ఎన్. జి రంగా వ్యవసాయ విద్యాలయంలో పెరటి తోటల పెంపకం పై 10 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులకు బుధవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం అధికారి డాక్టర్ మల్లీశ్వరి పెరటితోటల వలన ప్రయోజనాలు, యాజమాన్య పద్ధతులు గురించి వివరించారు. కృత్రిమంగా పండించిన కూరగాయలతో పోషకాహార లోపం లేకుండా ఉంటుందని తెలిపారు.