
GBS కలకలం.. తెలంగాణలో తొలి మరణం
తెలంగాణలో తొలి గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS) మరణం సంభవించింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన వివాహిత (25) జనవరి 31న ఈ వ్యాధి బారిన పడింది. ఆమె నరాల నొప్పులతో స్థానిక ఆస్పత్రిలో చేరింది. ఆ తర్వాత HYD నిమ్స్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసి ఆమెకు కుటుంబ సభ్యులు చికిత్స చేయించారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తి తగ్గింది. ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె శనివారం మృతి చెందింది.