నార్పల మండలం గూగూడు గ్రామంలో వెలసిన శ్రీ కుల్లాయిస్వామి దేవాలయంలో ఈ నెల 30న నిల్వ చేసిన 3 వేల కిలోల చక్కెర వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సాకేతపురం శోభ బుధవారం తెలిపారు. వేలంపాటలో పాల్గొనదలచిన వారు దేవాదాయ శాఖ కార్యాలయంలో రూ. 20 వేలు డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చని తెలిపారు.