చిరువ్యాపారులకు రుణాలు ఇవ్వాలి

83చూసినవారు
చిరువ్యాపారులకు రుణాలు ఇవ్వాలి
చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసి డెంట్ టి. ఆదినారాయణ కోరారు. ఈమేరకు పెద్దపప్పూరు ఏపీజీబీ మేనేజర్ బొజ్జన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఎంతో మంది చిరు వ్యాపారులు పెట్టుబడికి డబ్బు లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారికి రుణాలు మంజూరు చేస్తే వ్యాపారం చేసి కంతులను సకాలంలో చెల్లిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్