పెద్దవడుగూరు మండలం కాసేపల్లి నుంచి బండిశీల సుంకులమ్మ ఆలయానికి, గుత్తి-అనంతపురం గ్రామాలకు వెళ్లే రహదారి వద్ద ఎత్తైన నూతన బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు కురిసినప్పుడు బ్రిడ్జి తక్కువ ఉండటంతో వరద నీరు బ్రిడ్జి పైనుంచి పారుతోందని చెబుతున్నారు. ఎత్తైన బ్రిడ్జిని నిర్మిస్తే రాకపోకులకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.