తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని గురువారం సత్యసాయి నీటి సరఫరా పథకం కార్మికులు కలిశారు. ఎమ్మెల్యే నివాసంలో కలిసి వారి సమస్యలు విన్నవించారు. ఆరు నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని కోరారు. కార్యక్రమంలో రంగనాయకులు, పుల్లయ్య, టిప్పుసుల్తాన్, అంకన్న తదితరులు పాల్గొన్నారు.