తాడిపత్రి మండలంలోని ఆలూరుకోన రంగనాథస్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత ఆలూరు రంగనాథస్వామిని పట్టువస్త్రాలతో, పూల హారాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.