జర్నలిస్టుల కాలనీలో మొక్కల పంపిణీ కార్యక్రమం

57చూసినవారు
జర్నలిస్టుల కాలనీలో మొక్కల పంపిణీ కార్యక్రమం
ఉరవకొండ పట్టణంలోని స్థానిక రాయంపల్లి లేఅవుట్ వద్ద ఉన్న జర్నలిస్టుల కాలనీలో నిస్వార్థ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వర్షాకాలంలో మొక్కలు నాటడం వల్ల అవి త్వరగా పెరిగేందుకు అవకాశం ఉండడంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సంస్థ ప్రతినిధి వెంకట్ తెలిపారు. మొక్కలను నాటిన అనంతరం వాటి సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిస్వార్థ సంస్థ సబ్యులు కోరారు.

సంబంధిత పోస్ట్