అనంతపురం జిల్లాలో 24 గంటల్లో 673 రోడ్డు నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ శనివారం పేర్కొన్నారు. వారికి రూ. 1. 44 లక్షలు జరిమానా విధించామని అన్నారు. అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 88 మంది, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 9 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారణకు సహకరించాలని కోరారు.