పారిశుధ్య కార్మికుడు వెంకటేష్ కు అరుదైన గౌరవం

80చూసినవారు
పారిశుధ్య కార్మికుడు వెంకటేష్ కు అరుదైన గౌరవం
అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పారిశుధ్య కార్మికులకు అరుదైన గౌరవాన్ని ఇచ్చారు. గురువారం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కొందరు పారిశుధ్య కార్మికులను కార్యాలయం ఆవరణలో జెండా వందనం అనంతరం ఘనంగా సన్మానించారు. రెండవ సర్కిల్ లో పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్న వెంకటేష్ ను నగర మేయర్ వసీమ్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ లు ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్