అనంతపురం జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యవాణి శుక్రవారం గంజాయి కేసులో తీర్పు వెల్లడించారు. 20 మందిలో విచారణలో ముగ్గురు మృతి చెందగా, 17 మందిలో 12 మందికి 5 సంవత్సరాల జైలు, రూ.20 వేలు జరిమానా, మిగతా ఐదుగురికి ఏడాది జైలు, రూ.10 వేలు జరిమానా విధించారు. 2018లో పోలీసులు వారిని అరెస్టు చేసి గంజాయి, నగదు, సెల్‌ఫోన్లు, వాహనాలు సీజ్ చేశారు.