రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని వైసీపీ మహిళా నాయకురాలు చందన శివాజీ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 188 అత్యాచారాలు, 15 హత్యలు జరిగినట్టు తెలిపారు. మంగళవారం విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడారు. అనంతపురంలో యువతిపై పెట్రోల్ పోసి కాల్చిన ఘటనను ఖండించారు. ఏడుగుర్రాలపల్లిలో మైనర్‌పై 14 మంది అత్యాచారానికి పాల్పడటం దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.