ఢిల్లీలోని ఏపీ భవన్ లో జాతీయ ఓబీసీ సెమినార్ కు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎంపీ ఆర్. కృష్ణయ్య శుక్రవారం హాజరయ్యారు. బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50% రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, జనాభా గణనలో కులగణనను తీసుకోవాలని, బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 50%కి పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.