అనంతపురం నవోదయ కాలనీకి చెందిన సెంట్రింగ్ పనులు చేసే రామాంజనేయులు మంగళవారం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రామాంజనేయులు ఈ నెల మూడో తేదీన బైక్లో అనంతపురం నుంచి బుక్కరాయసముద్రం వెళ్తుండగా కొత్తపల్లి వద్ద రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.