కూడేరు మండలంలోని కొర్రకోడు గ్రామంలో జరిగిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో శనివారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఏరువాక పౌర్ణమినే అనుకూల సమయంగా చూసి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో పడుతూ పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.